telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చంచ‌ల్‌గూడ జైల్లో ష‌టిల్ ఆడేవాళ్ళు మాకు చెప్పేది ఏంటి..-పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

*వైసీపీ అంటే నాకు ద్వేసం లేదు..
*ఇంకోసారి ద‌త్త‌పుత్రుడు అని అంటే…సీబీఐ ద‌త్త‌పుత్రుడు అనాల్సి వ‌స్తుంది..
*సొంతవాళ్ళు ఉన్న‌ప్పుడు వేరేవాళ్ళ‌కి ద‌త్త‌త వెళ్ళ‌ను
*జ‌న‌సైనికుల‌పై చేయిప‌డితే మ‌ర్యాద‌గా ఉండ‌దు జాగ్ర‌త్త‌
*చంచ‌ల్‌గూడ జైల్లో ష‌టిల్ ఆడేవాళ్ళు మాకు చెప్పేది ఏంటి..
*తన సభలకు వచ్చిన యువత వైసీపీని నమ్మిందని..నాపై వ్య‌క్తిగ‌త ఇష్టం మాత్రం చూపించారు..

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను దత్తపుత్రుడు అని విమర్శిస్తే మిమ్మల్ని కూడా సీబీఐ దత్తపుత్రుడని అనాల్సి వ‌స్తుంద‌ని పవన్ హెచ్చరించారు.

ఏలూరు జిల్లా చింతలపూడిలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి జనసేన తరపున ఆర్ధిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా చింతలపూడిలో ఏర్పాటు చేసిన జనసేన రచ్చబండ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. .చంచల్‌గూడలో షటిల్ ఆడుకున్న మీరు నాకు చెబుతారా అంటూ పవన్‌కల్యాణ్ హెచ్చరించారు..

సొంతవారు వున్నప్పుడు ఎవరైనా ఎందుకు దత్తతకు వెళ్తారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తాను మీకంటే బాగా స్క్రీన్‌ ప్లే రాయగలనని.. సీఎం పదవికి తాను గౌరవం ఇస్తున్నానని, అందుకే మీరు అని అంటున్నానని పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీ అంటే తనకు ఏమాత్రం ద్వేషం లేదని పవన్‌కల్యాణ్ చెప్పారు.

వైసీపీ అంటే తనకు ఏమాత్రం ద్వేషం లేదని పవన్‌కల్యాణ్ చెప్పారు. వైసీపీ నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నిలదీస్తామని హెచ్చరించారు.

కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని తెలిపారు. కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల కష్టాలు కనిపించడం లేదన్నారు. పాదయాత్రలో కన్నీళ్లు తుడిస్తే సరిపొదని.. అధికారంలోకి వచ్చాక కూడా ఆ పనిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో వుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

తన సభలకు వచ్చిన యువత వైసీపీని నమ్మిందని.. నాపై వ్య‌క్తిగ‌త ఇష్టం మాత్రం చూపించారు అని అన్నారు..జనసేన కావాలో, వైసీపీ కావాలో యువత తేల్చుకోవాలని.. సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు టెక్నికల్‌గా సాధ్యం కాదంటున్నారని పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు.

వైసీపీ నేతలు పేదల కన్నీళ్లు తుడవలేకపోతే తాను ఖచ్చితంగా ప్రశ్నిస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రజల పన్నులతో వచ్చిన నిధుల్ని మీరు ఇస్తున్నట్లు చెప్పడం ఏంటని పవన్ ప్రశ్నించారు.

Related posts