telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు సామాజిక

తిరుపతిలో అగ్ని ప్రమాదం.. పరుగులుతీసిన స్థానికులు

fire accident in mojanjahi market hyd

తిరుపతిలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చిన్న బజారు వీధిలోని లలితా మెడికల్ స్టోర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కొన్ని క్షణాల్లోనే.. లలితా మెడికల్ స్టోర్‌తో పాటు పక్కనే ఉన్న కూల్‌డ్రింక్‌ షాపు పూర్తిగా కాలి బూడిదగా మారాయి. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు బయటకు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా షార్టుసర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఫైర్ అధికారులు పేర్కొన్నారు. అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరిగిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Related posts