telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నందిగామలో నారా దేవాన్ష్ సందడి..సభకు తీసుకొచ్చిన చంద్రబాబు

babu nara devnash

ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లాలో నందిగామలో ఆదివారం నిర్వహించిన సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ సందడి చేశాడు. సీఎంతో పాటు తల్లి నారా బ్రాహ్మణీతో పాటు అక్కడికి వచ్చిన ఈ చిన్నారి సభ ప్రారంభానికి ముందు తొలుత ఎన్టీఆర్ విగ్రహంపై పూలు చల్లి నమస్కరించాడు. తర్వాత తన తాత చూపుతున్నట్లు జనానికి విక్టరీ సింబల్ చూపించి అందరిని ఆకట్టుకున్నాడు. అనంతరం ప్రజలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ దేవాన్ష్‌ను ఇక్కడకు తీసుకురావడం వెనుక గల కారణాన్ని వివరించారు.

ఎన్నికల ప్రచారనీ బయలుదేరుతుండగా ‘‘తాతా నువ్వు ఎక్కడికి వెళుతున్నావు’’ అంటూ దేవాన్ష్ తనను అడిగాడని, ప్రచారానికి వెళుతున్నానని చెప్పానని.. అయితే తాను పడుతున్న కష్టం తెలియజేయాలన్న ఆలోచనతో దేవాన్ష్‌ను సభకు తీసుకువచ్చానని సీఎం వివరించారు. చిన్నతనం నుంచే సామాజిక స్థితిగతులు తెలియజేయడం ద్వారా ప్రజల పట్ల అతని మనసులో సానుకూల దృక్పథం అలవరచవచ్చని తెలిపారు. దేవాన్ష్ ఒక్కడే తన మనవడు కాదని.. రాష్ట్రంలోని పిల్లలందరూ తన మనుమలు, మనవరాళ్లేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Related posts