telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాలు : కేటీఆర్

ktr telangana

ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న వరంగల్- నల్గొండ- ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఎన్నికల ఇంఛార్జ్‌లు, నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం పనిచేస్తున్న ఎన్నికల ఇంఛార్జీలు, నాయకులు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.. ఈ సందర్భంగా బీజేపీపై మండిపడ్డారు కేటీఆర్.. ఉద్యోగాల కల్పన విషయంలో బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చిన ఆయన.. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,33,000 ఉద్యోగాలు ఇచ్చాం.. మరో 50 వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయబోతున్నామన్నారు.. ప్రభుత్వ ఉద్యోగులకు మన ప్రభుత్వానికి పార్టీకి ఉన్న సంబంధం పేగు బంధం లాంటిదని, ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు అనేక మినహాయింపులు ఇచ్చి ప్రమోషన్లు కూడా ఇచ్చామని గుర్తుచేశారు.. పార్టీ ఇంఛార్జ్‌లు రానున్న వారం రోజుల పాటు అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేసిన కేటీఆర్.. క్షేత్రస్థాయిలో విద్యావంతుల నుంచి వస్తున్న స్పందనను పలువురుతో మాట్లాడి తెలుసుకున్నారు. చూడాలి మరి దీని పై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి అనేది.

Related posts