telugu navyamedia
రాజకీయ వార్తలు

కాశ్మీర్ పై కేంద్ర క్యాబినెట్ భేటీ.. కీలక ప్రకటన వెలువడే అవకాశం!

parliament sessions from today

జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక అధికారాలపై నేడు కేంద్రం కీలక ప్రకటన చేస్తుందన్న వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో  ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. కశ్మీర్‌ పై ఏ విధమైన వ్యూహాలను అమలుచేస్తే, ఎటువంటి సమస్యలు వస్తాయన్న విషయంపైనే ప్రస్తుతం ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాశ్మీర్ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టడం, కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేయడంపైనా నేతలు చర్చిస్తున్నారని సమాచారం.

ఈ సమావేశానికి పలువురు మంత్రులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కూడా హాజరయ్యారు. క్యాబినెట్ భేటీ అనంతరం పార్లమెంట్ లో కీలక ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. వివాదాస్పదమైన ఆర్టికల్‌ 35ఏను రద్దు చేయవచ్చనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి.

Related posts