తెలంగాణ సీఎం కేసీఆర్ పై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు అహంకారం పెరిగిపోయిందన్నారు. రైతు దీక్షను చూసి తట్టుకోలేక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు.
సోనియాగాంధీని ఒప్పించి, తెలంగాణను తెచ్చిన కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ కు బఫూన్లు అయ్యారా? అని ప్రశ్నించారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తి కేసీఆర్ అని దుయ్యబట్టారు. రైతు సమస్యలపై నిలదీస్తే… చిల్లరగాళ్లు అయ్యారా? అని మండిపడ్డారు. అహంకారమే కేసీఆర్ పతనానికి దారి తీస్తుందని చెప్పారు.