telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఏమైనా వారికీ ఫిర్యాదు చేయాలి అంటున్న ఎన్నికల కమిషన్‌…

జీహెచ్‌ఎంసీ‌ ఎన్నికల్లో ఇప్పటికే ప్రచారానికి తెరపడగా.. రేపు పోలింగ్ జరగనుంది.. డిసెంబర్ 4వ తేదీన ఫలితాలు వెలువడ్డనున్నాయి… అయితే, ప్రచార పర్వం ముగియగానే.. ప్రలోభాలకు తెరలేపారు ఆయా పార్టీల అభ్యర్థులు, రాజకీయ నాయకులు.. వివిధ ప్రాంతాల్లో ఆ పార్టీ అభ్యర్థికి చెందిన సొమ్ము.. మరో పార్టీ వారు.. వీరికి చెందిన డబ్బులు మరొకరు పట్టుకోవడం.. పోలీసులకు ఫిర్యాదు చేయడం లాంటి ఘటనలు రాత్రి నుంచి చూస్తున్నాం.. దీంతో కీలక ప్రకటన విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌.. రాజకీయ పార్టీలు, కార్యకర్తలు ఎన్నికల అక్రమాలకు పాల్పడినా, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలకు పాల్పడినా, మరే ఇతర ఫిర్యాదులు ఉన్నా.. సంబంధిత ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. దీనికోసం.. ఎన్నికల సాధారణ పరిశీలకుల ఫోన్ నంబర్లు, వారికి కేటాయించిన సర్కిల్స్, వార్డులు ఈ సమాచారానికి జతచేసి విస్తృతంగా ప్రచారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts