telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కనుల కౌగిలింతలూ

మౌనం మెల మెల్లగా
జారుకుంటుంది ప్రేమలో…
మనసు దాటిరాని నా మౌనమే ప్రేమగా
నీ ఒంటరి హృదయానికి చేరువై బంధమైంది
నీ ఉనికే పవనమై
మధుర జావళీలై
కొండల్లో కొమ్మల్లో ఊసులై ధ్వనిస్తుంది
ఇరువురి శ్వాసల మేళవింపు
కనుల కౌగిలింతలూ
తనువున పులకరింపైతే
ఇరువురి హృదయాలు
సత్య సౌందర్య రూపమయ్యేనులే
అల్లుకుపోయే బంధాలే అక్షరాలై
అనుభూతులే అనుబంధాలై
నవ్య కావ్యాలయ్యేనులే….
మనసున మధుర గాయం చేసీ
తనువెల్లా వెదజల్లే పరిమళాలల్లే …
నువ్వు పూసిన లేపనమూ
నా పై నీ మనసున ప్రేమే సుమా !!
నను దోచిన ఓ చంద మామా
మౌనంపై మక్కువెందుకూ ఇంకా
ఒదిగిపోయిన మనసు నిద్రలోనుండగా
ప్రేమలో నిశ్శబ్దంగా…

Related posts