telugu navyamedia
తెలంగాణ వార్తలు

వెంట్ రెడ్డి, రేవంత్ రెడ్డికి మధ్య ఏం జరుగుతుందో తనకు తెలియదు..పీసీసీ చీఫ్ సమన్వయకర్త మాత్రమే

*ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు
*రేవంత్ పరిధి మేరకు పనిచేస్తున్నారు..
*హుజురాబాద్, మునుగోడును రెండూ ఒకేలా చూడలేం..
*శ్రవణ్ పార్టీని వీడటం బాధాకరం..
*అందరినీ సంతృప్తి పరచడం ఎవరి వల్లా కాదు..
*కోమటిరెడ్డి వెంట్ రెడ్డి, రేవంత్ రెడ్డికి మధ్య ఏం జరుగుతుందో తనకు తెలియదు

తెలంగాణ కాంగ్రెస్‌లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు .
ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ పీసీసీ చీఫ్ ఆయన పరిధి మేరకు పని చేస్తున్నార‌ని, రేవంత్‌కి, వెంకట్ రెడ్డికి మధ్య ఏం జరుగుతుందో తెలియద‌ని వెల్ల‌డించారు

పీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త…మేమంతా సోనియా నాయకత్వం‌లో పని చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు..
అందరినీ సంతృప్తి పరచడం ఎవరి వల్లా కాద‌ని అన్నారు. దాసోజు శ్రవణ్ పార్టీని వీడటం బాధాకరమ‌ని అన్నారు. హుజురాబాద్, మునుగోడును రెండూ ఒకేలా చూడలేమ‌ని అని పేర్కొన్నారు.

Related posts