telugu navyamedia
తెలంగాణ వార్తలు

డ‌బ్బులిచ్చి ప‌ద‌వి తెచ్చుకున్న రేవంత్‌ని సీఎం చెయ్య‌డానికి మేం కష్టపడాలా?

*భారీ చేరిక‌ల‌కు తెలంగాణ క‌మ‌లం ఫ్లాన్‌..
*జేపీ న‌డ్డాను క‌లిసిన రాజ‌గోపాల్ రెడ్డి..
*21 తేదీన బీజేపీ గూటికి రాజ‌గోపాల్ రెడ్డి
*చౌటుప్ప‌ల్‌లో భారీ బ‌హిరంగ స‌భ పెడుతున్నాం..
*స‌భ‌కు అమిత్ షా హాజ‌ర‌వుతారు..
*పార్టీ ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోయినా క‌ష్ట‌ప‌డి ప‌నిచేశా..
*నేను రాజీనామా చేస్తే ఆయ‌న ఇబ్బందేంటి..
ఓటుకు నోటు కేసులో జైలుకెళ్ళావు..

ఈ నెల 21న అధికారంగా బీజేపీలో చేరుతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి  ప్రకటించారు. మునుగోడులో బహిరంగ సభ ఉండే అవకాశం ఉందన్నారు. ఆ రోజున జరిగే బహిరంగ సభలో దాసోజ్ శ్రవణ్‌తో చాలా మంది పెద్ద పెద్ద నాయకులు బీజేపీలో చేరతారని చెప్పారు

ఈ వేళ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తో కోమటిరెడ్డి రాజోపాల్ రెడ్డి భేటి అయ్యారు. అనంత‌రం ఢిల్లో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రేడ్డిపై మండిప‌డ్డారు… త‌మ కుటుంబంపై పీసీసీ అధ్య‌క్షుడు బాష విని ఎంతో బాధ‌ప‌డ్డాన‌ని రాజ‌గోపాల్ రెడ్డి అన్నారు.

డ‌బ్బులిచ్చి పిసిసి అధ్య‌క్షుడు ప‌ద‌వి తెచ్చుకున్న నిన్ను..సీఎం చెయ్య‌డానికి మేంకష్టపడాలా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తులను తీసుకొచ్చి మా నెత్తిన పెట్టారు .రేవంత్ ఏం పొడిచారని..?, తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లాడా?.. అని ప్రశ్నల వర్షం కురిపించారు.  

ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాటం చేశానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోయినా  క‌ష్ట‌ప‌డి ప‌నిచేశాన‌ని అన్నారు అన్నారు. టీఆర్‌ఎస్‌లోకి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. వారిపై అధిష్టానం ఏం చర్యలు తీసుకుందని,అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్ర‌శ్నించారు.

ప్రజల కోసం, అభివృద్ది కోసం, తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోసం ప్రజస్వామ్యబద్దంగా  కాంగ్రెస్‌, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి  బీజేపీలో చేరుతున్నానని చెప్పారు.ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారడం మోసం చేయడమా? మునుగోడు అభివృద్ధికి సొంత నిధులు ఖర్చు చేశా అని అన్నారు.

మునుగోడు నియోజకవర్గ అభివృద్ది కోసం నిధులు ఇవ్వాలని ఎన్నోసార్లు అడిగాను.. కానీ పట్టించుకోలేదని చెప్పారు. నా రాజీనామాతోనైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లు తెరవాల‌ని అన్నారు. మునుగోడులో సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సంద‌ర్భంగా రాజగోపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Related posts