telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పీఎం మీద తెలంగాణ సీఎం ఫైర్…

kcr stand on earlier warning to rtc employees

ఈరోజు పార్టీ సీనియర్ నేతలతో కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన కీలక వివరాలు వెల్లడించారు. బిజెపి కొత్తగా ఒక్క సంక్షేమ పథకం కూడా తీసుకురా లేదని, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరణ చేస్తోందని అన్నారు. కేంద్రం పై పోరాటం మొదలు పెట్టానన్న ఆయన డిసెంబర్ రెండో వారంలో కాంక్లేవ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో విపక్ష పార్టీలతో చర్చలు జరుపుతామని ఆయన అన్నారు. ఇప్పటికే పది మంది పార్టీ అధ్యక్షులతో చర్హలు జరిపామని, కొంతమంది ముఖ్యమంత్రులతో కూడా చర్చించానని అన్నారు. ఒక్కొక్క డివిజన్ కు ఒక్కొక్క ఎమ్మెల్యే ఇంఛార్జిగా ఉంటారన్న ఆయన మంత్రులకు డివిజన్ బాధ్యతలు అప్పగించారు. సాయంత్రం టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటిస్తానన్న ఆయన గ్రేటర్ లో 105 సీట్లు గెలుస్తామని అన్నారు. వరద బాధితులకు సంబంధించిన 2 లక్షల అప్లికేషన్ లు వచ్చాయని అన్నారు. ఇప్పటి వరకు లక్షా అరవై వేల అప్లికేషన్ లు క్లియర్ అయ్యాయని ఆయన అన్నారు. ఎలక్షన్ ల తర్వాత మిగతా వారికి ఇస్తామని అన్నారు. కేంద్రం పైన మనం పోరాటం చేయాలన్న ఆయన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం చూస్తోందాని అన్నారు.   వివిధ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అధినేతల తో ఈరోజు ఫోన్ లో మాట్లాడానని, కేంద్రం పైన భవిష్యత్తులో మనం. అందరినీ కలుపుకొని పోయి యుద్ధం చేస్తామని అన్నారు. కార్మికుల పక్షాన మనం పోరాటం చేస్తామన్న ఆయన అన్ని కంపెనీలు ప్రైవేటు పరం చేసే కార్మికులు రోడ్డున పడతారని తెలిపారు.

Related posts