telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అడల్ట్ కంటెంట్ తో ‘క్రష్’ మూవీ టీజర్

crush

తొలి సినిమా ‘అల్లరి’ నుంచి విభిన్నమైన కాన్సెప్ట్ ల‌తో ప్రేక్షకుల ముందుకొస్తుంటారు రవిబాబు. ప్రస్తుతం అడల్ట్ కంటెంట్‌తో ‘క్రష్’ అనే సినిమాను తీశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ‘ఫస్ట్ పీప్’ పేరుతో ఓ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ వీడియో మొత్తం డబల్ మీనింగ్ డైలాగులతో , బోల్డ్ సీన్లతో నింపేశారు. ఈ ట్రైలర్‌లో ముగ్గురు యువకులను రవిబాబు ఇంటర్వ్యూ చేస్తుండగా… వారు తమ గర్ల్‌ఫ్రెండ్స్ గురించి, వాళ్లతో శృంగార అనుభవాల గురించి వివరిస్తూ ఉంటారు. ముగ్గురు హీరోయిన్లు అందాల ఆరబోతలో పోటీ పడ్డారు. పూర్తిగా అడల్ట్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమా యూత్‌ను టార్గెట్ చేసుకుని తీసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని రవిబాబు తన హోమ్ బ్యానర్ ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నాడు. 

Related posts