ఢిల్లీలో టీడీపీ అధ్యక్షుడు, ఏపీసీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ధర్మ దీక్ష సందర్భంగా ఆయనను ఒక జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. ఆ జాతీయ మీడియా వైసీపీ కలిసివస్తే .. అని అడిగిన ప్రశ్నకు బాబు స్వాగతిస్తాం అని జవాబునిచ్చారు. అలా వచ్చినప్పుడు చూద్దామని, వస్తే కలిసి పోరాడి రాష్ట్ర హక్కులను సాధించుకుంటామని ఆయన అన్నాడు. దీనితో టీడీపీ-వైసీపీ పొత్తుపై కొత్త కధనాలు వెలువడుతున్నాయి. ఇది జాతీయమీడియాతో అన్న మాటలు. ఇక అదే చంద్రబాబు తెలుగు రాష్ట్ర మీడియాతో అదే ప్రశ్నకు జవాబుగా, ఒక నేరస్తుడిని ఎలా కలుపుకుంటాం అనటం విశేషం. రెండో మూడో ఎంపీ సీట్లను గెలుచుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తమకు మద్దతిచ్చేందుకు ముందు వస్తే అప్పుడు చూద్దామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి వ్యాఖ్యానించారు.
ఇక ఏపీలో జరగనున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు ఇచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ అధికార ప్రతినిది రసూల్ ఖాన్ తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగానే ఈ మద్దతు ఉంటుందని… జగన్ కు ఓటు వేయాలని తమ పార్టీ ఏపీ ప్రజలను కోరనుందని చెప్పారు. జగన్ లౌకికవాది, పేద ప్రజల సన్నిహితుడని అన్నారు. ఏపీలో నివాసముంటున్న తెలంగాణ ప్రజలు, వ్యాపార భాగస్వాములను వైసీపీకి ఓటు వేయాలని కోరుతామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. లోక్ సభ ఎన్నికల తర్వాత లౌకికవాద, ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని అన్నారు. దీనిపై బాబు మాట్లాడుతూ, ఒకపక్క బీజేపీతో మరోపక్క కేసీఆర్ తో కలిసి పనిచేస్తున్న వారు తమకు మద్దతు ఇచ్చినా దానివెనుక కుట్రలు ఉంటాయని అన్నారు. టీడీపీకి బీజేపీ మరియు వైసీపీ మాత్రమే దూరంగా ఉన్నాయని, మిగిలిన అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
అందుకే జగన్ ఢిల్లీలో ప్లేటు ఫిరాయించాడు: మంత్రి యనమల