`లీడర్` సినిమాతో వెండితెర అరంగేట్రం చేశాడు యంగ్ హీరో రానా. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. తెలుగుతోపాటు పలు ఇతర భాషల్లోనూ నటించాడు. ఆ తర్వాత రాజమౌళి రూపొందించిన `బాహుబలి`తో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. వెండితెరకు పరిచయమై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా `బాహుబలి` గురించి రానా మాట్లాడాడు. `లీడర్` తర్వాత నేను నటించిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఆ తరుణంలో డైరెక్టర్ క్రిష్ నాకు `కృష్ణం వందే జగద్గురం` సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఆ సినిమాను చూసిన రాజమౌళి నాకు `బాహుబలి` అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం వచ్చాక ఆరు నెలలపాటు శరీరాకృతి, థియేటర్ క్లాస్ లాంటి అంశాల్లో శిక్షణ తీసుకున్నా. `బాహుబలి` సినిమా షూటింగ్ సమయంలో నా కాలు బెణికింది. ఆరు వారాల పాటు చాలా ఇబ్బంది పడ్డానని రానా తెలిపాడు.
previous post