telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

మండు వేసవిలో చల్లదనానికి ఇవి తినండి

summer

ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో శరీరం డీహైడ్రేషన్‌‌కు గురికాకుండా ఉండాలంటే.. తప్పకుండా చలవ చేసే ఆహారాన్ని తీసుకోవాలి.

పెరుగు : వేసవిలో తప్పకుండా పెరుగు తప్పకుండా తినాలి లేదా మజ్జిగా చేసుకుని తాగాలి. ఇది శరీరాన్ని ఎల్లప్పుడు చల్లగా ఉంచుతుంది. మీకు మధుమేహం సమస్యలు లేనట్లయితే చల్లని లస్సీ చేసుకుని తాగండి. కీర దోసకాయ, ఉల్లిపాయలతో రైతా తయారు చేసుకుని తినండి. సీజనల్ ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే.. పెరుగు వేసి స్మూతీస్ తయారు చేసుకుని తాగండి.

పుచ్చకాయ : వేసవిలో అందుబాటులో ఉండే పుచ్చకాయలో 91.45 శాతం నీరే ఉంటుంది. పుచ్చకాయ తినడం వల్ల శరీరానికి అవసరమైన నీరు చేరుతుంది. అంతేగాక పుచ్చకాయలో ఉండే యాంటీ ఆక్సైడులు కూడా శరీరానికి అందుతాయి. మీ శరీరాన్ని ఎప్పుడూ కూల్‌గా ఉంచుతాయి.

కర్బూజాలు : కర్బూజాల్లో సైతం బోలెడంత నీరు ఉంటుంది. వేసవిలో వీటిని తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది మిమ్మల్ని ఎప్పుడూ డీహైడ్రేడ్ కాకుండా చూస్తాయి. శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. నీళ్లు కావాలంటే నేరుగా తాగవచ్చు కదా.. ఇవే ఎందుకు తినాలని చాలామంది భావిస్తారు. సాధారణ నీటికి పండ్లలో ఉండే నీటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. పండ్లలో ఉండే నీటిలో చాలా పోషకాలు ఉంటాయి.

కీర దోసకాయ : ఈ కాయలో బోలెడంత ఫైబర్ ఉంటుంది. వేసవిలో కీర దోసకాయ తింటే అనారోగ్యం దరిచేరదు. పుచ్చకాయ తరహాలోనే కీరదోస కాయాలో కూడా నీటి శాతం ఎక్కువే. అలాగే, ఈ వేసవిలో నిమ్మ రసం తాగడం అస్సలు మరిచిపోకండి. వేసవిలో నిమ్మరసం మీకు బోలెడంత శక్తి ఇస్తుంది.

కొబ్బరి నీళ్లు : వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఎన్నో విటమిన్లు, మినరల్స్ తదితర పోషకాలు ఉంటాయి. వేడి వాతావరణంలో మీ శరీరానికి శక్తినిచ్చే ఔషదం కొబ్బరి నీళ్లే. రోజూ కొబ్బరి నీళ్లు తాగినట్లయితే క్యాన్సర్ దరిచేరదని పలు పరిశోధనల్లో పేర్కొన్నారు.

Related posts