ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ గతేడాది ఓ వింత క్యా్న్సర్ సోకిందని వెల్లడించి ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసారు. ఏడాది పాటు లండన్‌లోనే ఉండి చికిత్స తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ గ్యాప్‌లో ‘అంగ్రేజీ మీడియం’ అనే సినిమాలో కూడా నటించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన భార్య తన ఆరోగ్యం పట్ల తీసుకున్న శ్రద్ధ గురించి ఇర్ఫాన్ వివరించారు. ‘క్యాన్సర్ సోకడంతో నా జీవితం రోలర్ కోస్టర్ రైడ్‌గా మారింది. కానీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తక్కువగా ఏడ్చాం, ఎక్కువగా నవ్వుకున్నాం. నా కుటుంబం అంతా ఒకటైపోయింది. ఆత్రుత పెరిగిపోయేది కానీ ఎలాగోలా కంట్రోల్ చేసుకున్నాను. ఈ ఏడాది నేను ఇంట్లో ఉండి నా పిల్లలు ఎలా ఎదుగుతున్నారో కళ్లారా చూసుకోగలిగాను. ఇక నా భార్య సుతాపా గురించి ఏం చెప్పగలను. నాతో పాటు 24 గంటలూ ఉంది. నాకోసం చేయాల్సినవన్నీ దగ్గరుండి చేసింది. అన్నీ తానై చూసుకుంది. ఒకవేళ నాకు బతకాల ఆశ ఉందంటే అది తనకోసమే. నేను బతికితే తనకోసమే బతకాలని అనుకున్నాను. నేను ఇప్పటికీ సంతోషంగా ఉన్నానంటే అందుకు నా భార్యే కారణం’ అని తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం ఇర్ఫాన్ రెస్ట్ తీసుకుంటుండడంతో బాలీవుడ్‌కు చెందిన టాప్ హీరోయిన్స్ ఆయన సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చారు. ఆలియా భట్, అనుష్క శర్మ, కత్రినా కైఫ్, కియారా అద్వానీ, అనన్యా పాండే, జాన్వి కపూర్, కృతి సనన్
previous post