telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కలెక్టర్ల ఆధ్వర్యంలో ఔట్ సోర్సింగ్ నియామకాలు: సీఎం జగన్

cm jagan ycp

జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఔట్ సోర్సింగ్ నియామకాలు జరుగుతాయని సీఎం జగన్ అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆన్ లైన్ ద్వారా ‘అప్కోస్’ (ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్) ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకున్నారని, కానీ ఆ వ్యవస్థను మార్చి నియామకాల్లో పారదర్శకత తీసుకురావాలనే చర్యలు చేపట్టామని తెలిపారు.

 వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకే ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరికీ లంచాలు ఇవ్వనవసరంలేదన్నారు. 50 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీలు, బీసీ, మహిళలకే ఇస్తామని స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులుగా నియమితులైన వారికి ప్రతి నెల 1వ తేదీన ‘అప్కోస్’ (ఏపీసీఓఎస్) ద్వారా జీతాలు చెల్లించడం జరుగుతుందని వెల్లడించారు.

Related posts