telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్-3 సీక్రెట్ బయటపెట్టేసిన జాఫర్

Jaffar

మొదటివారం సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజ‌న్ 3 రెండో వారం చివ‌రికి చేరుకుంది. మొదటివారంలో హేమ ఎలిమినేట్ అవ్వగా ఆమె స్థానంలో వైల్డ్ కార్డు ఎంట్రీగా ట్రాన్సజెండర్ తమన్నా సింహాద్రి వచ్చారు. ఇక ఆ తరువాత గొడవలతో, సరదాలతో సాగిపోతోంది బిగ్ బాస్. రెండవ వారం నామినేష‌న్‌లో వ‌రుణ్ సందేశ్‌, వితికా, శ్రీముఖి, హిమ‌జ‌, జాఫ‌ర్‌, మ‌హేష్‌, పున‌ర్న‌వి, రాహుల్ సిప్లిగంజ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజా ఎపిసోడ్ లో రెండవ వారం ఎలిమినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ ఎలిమినేషన్ ఎవ్వరూ ఊహించని సంఘటన జరిగింది. ముందుగా ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా తమకు నచ్చిన వారికి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టారు. అందరూ ఊహించినట్టుగానే జాఫర్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఈ సారి ఈ ప్రాసెస్ చాలా ఎమోషనల్ గా సాగింది. జాఫర్ వెళ్ళిపోతుంటే హౌస్ మేట్స్ అందరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఎక్కువగా బాబా భాస్కర్ తో కనిపించే జాఫర్ ఇంట్లోని మిగతా వాళ్ళతో కూడా స్నేహంగా ఉన్నాడు. అయితే జాఫర్ వెళ్ళిపోతూ ఆఖరి క్షణంలో వరుణ్ సందేశ్ కి ఊహించని షాక్ ఇచ్చాడు. బాబా భాస్కర్ ని ఏమీ అనొద్దు అని చెప్తూ ఒక చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాడు. అయితే వెళ్లిపోయే ముందు జాఫర్ వవ షో గురించిన ఓ సీక్రెట్ ను బయటపెట్టారు. అదేంటంటే… బిగ్ బాస్ రియాలిటీ షో గురించి తనకు ముందుగా దురభిప్రాయం ఉండేదని, బయట చాలామందికి ఇలాంటి అభిప్రాయమే ఉందని, బిగ్ బాస్ అంతా ముందస్తుగా అనుకున్న స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతోందని చాలా మంది భావిస్తుంటారని జాఫర్ అన్నాడు. అయితే అది తప్పని చెప్పాడు. తాను ప్రత్యక్షంగా చూసినవాడిని కాబట్టి, బిగ్ బాస్ నిజంగా ఓ రియాలిటీ షోనే అని అన్నారు. ఇందులో కంటెస్టెంట్స్ కొట్టుకోవడం, మళ్లీ కొద్దిసేపటికి కలిసిపోవడం అంతా కూడా స్క్రిప్ట్ అనుకుంటారని, కానీ అదంతా స్క్రిప్ట్ కాదని, నిజమేనని చెప్పాడు.

Related posts