telugu navyamedia
తెలంగాణ వార్తలు

‘జబర్దస్త్‌’ కమెడియన్‌ అదిరే అభికి తీవ్ర‌గాయాలు ..

టాలీవుడ్‌ నటుడు, కమెడియన్‌ అదిరే అభి ప్రమాదానికి గురయ్యారు. అభి ప్రధాన పాత్రలో ఓ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. తాజాగా యాక్షన్ సన్నివేశాల్లో స్టంట్స్ చేసే క్రమంలో అభి ప్రమాదానికి గురయ్యారు. స్టంట్స్ కోసం ముందే శిక్షణ తీసుకున్నా.. షూటింగ్ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. షూటింగ్ స్పాట్‌లో ప్రథమ చికిత్స అనంతరం అభిని ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో ఆయన చేతికి, కాలికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చేతికి పెద్ద గాయమే అయిందని, దాదాపు 15 కుట్లు పడినట్లు చిత్రయూనిట్‌లోని ఒకరు తెలిపారు. ప్రస్తుతం అభి క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యుల సలహా మేరకు కొన్ని రోజుల వరకు అభి విశ్రాంతి తీసుకోనున్నారు.

ప్రభాస్‌ హీరోగా నటించిన ‘ఈశ్వర్‌’తో టాలీవుడ్‌కి పరిచయం అయ్యాడు అభి. ఆ తర్వాత కొన్నాళ్లు పలు రియాల్టీ షోలకు యాంకర్‌గా వ్యవహరించారు.ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్‌లో ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్దస్త్ షో టీమ్ లీడ‌ర్ గా చేరి ఎంతో మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు కమెడియన్ అదిరే అభి.

తాను ఎదగడంతో పాటు.. తన టీమ్‌లో ఎంతోమందికి అవకాశాలు ఇచ్చి జీవితాన్ని ఇచ్చాడు. ఇటీవల జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పిన అభి.. మా టీవీలో ప్రసారమయ్యే కామెడీ షోలో ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ తన డిఫరెంట్ కాన్సెప్ట్ స్కిట్లతో అభిమానులను అలరిస్తున్నాడు.ప్రస్తుతం ఆయన పలు సినిమాలతో పాటు ఓ కామెడీ షో చేస్తున్నాడు.

Related posts