telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నదుల అనుసంధానంపై.. ఏపీ సీఎం, నేను ఒక అభిప్రాయానికి వచ్చాం: కేసీఆర్

KCR cm telangana

మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా వనపర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ నదుల అనుసంధానంపై ఏపీ సీఎం, నేను ఒక అభిప్రాయానికి వచ్చామని తెలిపారు. నదుల అనుసంధానంపై తెలుగు రాష్ట్రాలు తగిన రీతిలో అగ్రిమెంట్ చేసుకుంటాయని కేసీఆర్ స్పష్టం చేశారు.

పాలమూరు ఎత్తిపోతల పథకం రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా కోసం రూపొందించిన ప్రాజెక్టు అని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకం రాబోయే 10 మాసాల్లో పూర్తవుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు.గత పాలకుల అసమర్థత వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు. మంచినీళ్ల కోసం మనం అనేకసార్లు కర్ణాటకను బతిమాలినమని చెప్పారు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడం వల్ల 570 టీఎంసీల నీళ్లు వాడుకోవడానికి వెసులుబాటు కలిగిందన్నారు. 

Related posts