తెలంగాణలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్‌లో కరోనా కేసులు భయపెట్టే స్థాయిలో పెరుగుతుండడంతో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. దీనికి తోడు లాక్‌డౌన్ ప్రచారంతో ఏపీ వాసులు నగరాన్ని విడిచిపెడుతుండడంతో భాగ్యనగరంలోని రోడ్లు బోసిపోతున్నాయి. రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య కూడా తగ్గింది. దీంతో లాక్‌డౌన్ తొలినాటి రోజులు మళ్లీ కనిపిస్తున్నాయి.
హైదరాబాద్‌లో గత పక్షం రోజులుగా రోజుకు దాదాపు వెయ్యి వరకు కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు మరింత పెరుగుతుండడంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఫలితంగా రోడ్లపైకి వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. లాక్‌డౌన్ విధిస్తారన్న ఊహాగానాలతో ఏపీ వాళ్లు ఇప్పటికీ స్వగ్రామాలకు తరలుతుండడంతో చాలా ప్రాంతాల్లోని రోడ్లు పూర్తిగా బోసిపోయాయి.
చిన్నపిల్లలు కూడా మద్యానికి బానిస అవుతున్నారు: లక్ష్మీపార్వతి