telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

చంద్రయాన్-2 ప్రయోగంలో.. తొలిదశ విజయవంతం

isro reharsals on chandrayan 2 grand success

భారత అంతరిక్ష చరిత్రలో మరో అద్భుత ఘట్టం. అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజక్టు చంద్రయాన్-2 ప్రయోగాన్ని విజయవంతంగా ముగించింది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి చంద్రయాన్‌-2ను ప్రయోగించారు. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు షార్‌ నుంచి జీఎస్‌ఎల్వీ మార్క్‌3ఎం1 రాకెట్‌ ద్వారా రివ్వున జాబిల్లి వైపు దూసుకెళ్లింది.చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతం అవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగి తేలారు. ఒకరినొకరు పరస్పరం అభినందించుకున్నారు.

కాగా మొన్నటి ప్రయోగంలో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరించి విజయవంతంగా ప్రయోగం పూర్తి చేసినట్లు ఇస్రో పేర్కొంది. ఇది ఇస్రోలోని ప్రతి ఒక్కరి విజయమని, దేశ విజయమని హర్షం వ్యక్తం చేశారు. రాకెట్ నిర్దేశిత క్రమంలో కొనసాగుతోంది. రెండో దశలో భాగంగా అత్యంత కీలకమైన క్రయోజనిక్ బూస్టర్లను మండించారు. వీటిసాయంతో జీఎస్ఎల్వీ రోదసిలో మరింత ముందుకు సాగనుంది.

Related posts