పవన్ కళ్యాణ్ లైనప్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఓజీ, హరిహరవీరమల్లు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
ఈ సినిమాల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
పవన్ రాజకీయాల్లో బిజీ అవ్వడంతో ఈ సినిమాల షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తున్నాయి.
తాజాగా పవన్ కళ్యాణ్ ఓ తమిళ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయా ఇంటర్వ్యూలో యాంకర్ రాజకీయాల్లో బిజీగా మారిపోయారు గా ఇక సినిమాలు చేయడం మానేస్తారా.? అని ప్రశ్నించారు.
దానికి పవన్ కళ్యాణ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నాకు డబ్బు అవసరమైనంత కాలం సినిమాలు చేస్తూనే ఉంటాను.
అయితే అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ జాబ్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వను అని పవన్ కళ్యాణ్ అన్నారు. దాంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
భవిషత్తులో పవన్ సినిమాలు కంటిన్యూ చేస్తా అని చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.