telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

ఫోన్ మర్చిపోయిన యువతి… అందులో ఫోటోలు చూసిన పోలీసులకు షాక్

ISIS

జర్మనీలో ఈవెంట్ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న 38 ఏళ్ల ఒమామియా అబిడి అనే మహిళ పొరబాటున తన ఫోన్ పారేసుకుంది. ఆ ఫోన్ దొరికిన వ్యక్తి.. దాన్ని తిరిగిచ్చేయాలని అనుకున్నాడు. తెలిసిన వారి ఫోన్ నెంబర్ల కోసం ఆ ఫోన్ ఆన్ చేశాడు. దానిలో ఉన్న కొన్ని ఫొటోలను చూసిన అతనికి ముచ్చెమటలుపట్టాయి. దానిలో ఓ మహిళ, ఆమె పిల్లలు, భర్త అంతా తుపాకులు, బాంబుల మధ్య ఉన్న చిత్రాలున్నాయి. దాంతో పోలీసులకు ఆ ఫోన్ హ్యాండోవర్ చేయడంతో.. అసలు విషయం బయటపడింది. ఒమామియా ఐఎస్ తీవ్రవాదని, అక్కడ ఆమెకు ఇద్దరు భర్తలున్నారని, పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. ఆమె చాలామంది యూరోపియన్ యువతులను ఐఎస్‌లో చేర్పించిందని కూడా తేలింది. ప్రస్తుతం జర్మనీలో పనిచేసుకుంటున్న ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

Related posts