telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఐదేళ్ల కొడుకును సముద్రంలోకి విసిరేసిన తండ్రి… తరువాత…

Florida

ఫ్లోరిడాకు చెందిన జాన్ బ్లడ్స్‌వర్త్ అనే 37 ఏళ్ళ వ్యక్తి పసివాడని కూడా చూడకుండా ఈత నేర్చుకొమని కుమారుడిని అట్లాంటిక్ సముద్రంలో పారేశాడు. డేటోనా బీచ్‌లో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. రాత్రి సమయంలో బీచ్ ప్రాంతానికి కొడుకుతో కలిసి వచ్చిన జాన్ ఫుల్లుగా మద్యం సేవించాడు. ఆ తరువాత కొడుకును ఈత నేర్పిస్తానంటూ తనతో పాటు నీటిలోకి తీసుకెళ్లాడని అక్కడే ఉన్న కొందరు సందర్శకులు పోలీసులతో చెప్పారు. బీచ్‌లో ఉన్నవారు రాత్రిపూట నీటిలోకి వెళ్లడం మంచిది కాదని వారించిన వినలేదు. కొద్దిసేపు కుమారిడితోనే ఉన్న అతడు.. ఈత నేర్చుకొనే బయటకు రావాలంటూ నీటిలోనే పసివాడిని వదిలేసి బయటకు వచ్చేశాడు. అలలను చూసి కొడుకు భయపడుతుంటే నేను ఉన్నాను.. బ్యాక్ ఫ్లిప్ చేయమంటూ ఒడ్డున కూర్చొని ఉచిత సలహా ఇచ్చాడని బీచ్ సందర్శకులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న తండ్రి.. పసివాడిని చంపేశాలా ఉన్నాడని అక్కడ ఉన్న కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పిల్లోడ్ని బయటకు తీసుకొచ్చారు. జాన్‌ను పసివాడి పట్ల ఇలా ఎందుకు చేశావని అడిగితే… ఈత నేర్పిస్తున్నానంటూ తాపీగా బదులిచ్చాడు. దాంతో అతడ్ని అదుపులోకి తీసుకొని కటకటాల్లోకి నెట్టారు. అనంతరం 1500 డాలర్ల(రూ.పది వేలు) పూచీకత్తుపై విడుదల చేశారు.

Related posts