telugu navyamedia
సినిమా వార్తలు

సన్నీలియోన్ ఫ్యామిలీ ఫోటో వైరల్… ఏ వృత్తిలో పని చేస్తున్నా అంతా దైవసమానులే… !

Sunny

శ‌ృంగార తార సన్నీలియోన్ మరోసారి గూగుల్ మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రిటీల జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. అత్యధికంగా గూగుల్‌లో వెతికిన సెలబ్రిటీల్లో సన్నీలియోన్ అగ్రస్థానంలో నిలిచారు. ఐటమ్ సాంగ్‌లతో, కైపెక్కించే చూపులతో ఈ బ్యూటీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన మధురానుభూతులను షేర్ చేసుకుంటున్న ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5 కోట్ల మంది ఫాలోయర్లను సంపాదించుకుంది. సన్నీలియోన్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సమయంలో వరుసగా విమర్శలు ఎదురయ్యాయి. మీడియా నుంచి పదే పదే అశ్లీల చిత్రాల నటి అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ విమర్శలకు కుంగిపోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ క్రేజీ సెలెబ్రిటీగా మారిపోయింది. ప్రస్తుతం సన్నీలియోన్ కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాక సౌత్ చిత్రాలలో కూడా నటిస్తోంది. నటిగా రాణిస్తూనే వాణిజ్య ప్రకటనలతో సైతం సన్నీ బిజీగా మారిపోయింది. సన్నీలియోన్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన తన ఫ్యామిలీ ఫోటో వైరల్ అవుతోంది. భర్త డానియల్ వెబర్, పిల్లలతో కలసి సన్నీలియోన్ తన నివాసంలో వినాయక చవితి సందర్భంగా పూజ చేసింది. గణపతి విగ్రహం ముందు తన ఫ్యామిలీతో సాంప్రదాయ వస్త్రధారణలో సన్నీలియోన్ ఉన్న ఫోటో నెటిజన్లని ఆకట్టుకుంటోంది. ఏ వృత్తిలో పని చేస్తున్నా దైవం ముందు అంతా సమానులే అని సన్నీలియోన్ తన భక్తిని చాటుకుంది.

Related posts