telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భర్తతో సోనమ్ కపూర్ రొమాన్స్… పబ్లిగ్గా…!?

Sonam-Kapoor

బాలీవుడ్‌లో స్టైలిష్ దివా సోనమ్ కపూర్ పెళ్లి తర్వాత కూడా అదే స్థాయిలో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సోనమ్ కపూర్ కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన చిత్రాలను ఎంచుకుని తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇటీవలే “జోయా ఫ్యాక్టర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక భర్త ఆనంద్ ఆహుజాతో ఎప్పటికప్పుడు రచ్చ చేస్తూనే ఉంటుంది సోనమ్. బయటికి వచ్చినా కూడా ఈ ఇద్దరి రొమాన్స్ బయట సంచలనం రేపుతుంటుంది. ఇప్పుడు కూడా మరోసారి పబ్లిక్‌గా రెచ్చిపోయారు ఈ జోడీ. జిమ్‌లో ఉండగానే భార్యతో రొమాన్స్ లో మునిగిపోయాడు ఆనంద్. అందరూ చూస్తుండగానే భార్య సోనమ్‌ను ఎత్తుకుని గిరాగిరా తిప్పేసాడు. వీళ్ల రొమాన్స్ చూసి అంతా షాక్ అయ్యారు కూడా. జిమ్‌లో వీరిద్దరి రొమాంటిక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts