telugu navyamedia
రాజకీయ

రాఖీపండుగకు స్పెషల్‌ ఆఫ‌ర్‌ !

అన్నా చెల్లెలు అనుభందానికి, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు మ‌ధ్య జ‌రిగే పండుగను రాఖీ పండుగ అంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం.

Raksha Bandhan | Rakhi | Gift Ideas | DIY Rakhi

రాఖీ అనగా రక్షణ బంధం అని, ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ.అది చాలా ఉత్సాహంతో జరుపుకుం‌టూరు.

అయితే రాఖీ పండుగ పుర‌స్క‌రించుకుని ఇండియ‌న్ ఆర్ సి. టీ.సి మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్ ప్ర‌క‌టించింది. తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్పెషల్ ఆఫర్ ఇచ్చింది. మహిళా ప్రయాణికులకు మాత్ర‌మే 5 శాతం క్యాష్‌బ్యాక్ ప్ర‌క‌టించింది. ఈ ఆఫ‌ర్ లో 15 ఆగస్టు 2021 మరియు 23 ఆగష్టు 2021 మధ్య తమ రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవాలని తెలిపింది. ఢిల్లీ, అహ్మదాబాద్ – ముంబై తేజస్ ఎక్స్‌ప్రెస్ లో వెళ్ళొచ్చు.

Raksha Bandhan 2019: History, importance, significance of Rakhi Festival in  India | Lifestyle News,The Indian Express

అలాగే యూపీ ప్రభుత్వం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ర‌క్షా బంధన్ వెళ్ళే మహిళలకు ఏ బస్సులోనైనా, ఎప్పుడైనా ఉచితంగా ప్రయాణించేలా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

Rakhi: The Thread Which Binds | City News Nagpur | Live News Nagpur

21 ఆగస్ట్‌ అర్ధరాత్రి నుంచి 22 ఆగస్ట్‌ అర్ధరాత్రి 12 గంటల వరకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని ఉత్తర్వుల్లో తెలిపింది. మహిళలు అన్ని రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని యూపి.ఎస్ ఆర్. టి. సి పేర్కొంది. పింక్ టాయిలెట్ల నిర్మాణంతోపాటు రాష్ట్రంలోని దాదాపు 1300 పోలీస్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో మహిళా పోలీసుల నియామకం కూడా చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది.

Related posts