telugu navyamedia
సినిమా వార్తలు

‘శ్రీదేవి సోడా సెంటర్‌’ ట్రైలర్‌

 

టాలీవుడ్‌ హీరో సుధీర్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందాన్ని అభినందించారు. సినిమా విజయం సాధించాలని కోరుకున్నారు. ‘పలాస 1978’ ఫేమ్‌ కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీదేవి సోడా సెంటర్‌’లో సుధీర్‌బాబు గ్రామీణ యువకుడిగా కనిపించనున్నారు. ఆనంది హీరోయిన్‌గా నటించిది. గ్రామీణ నేపథ్యంలో ప్రేమ, కుటుంబకథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ లవ్ స్టోరీ ట్రైలర్ లో విజువల్స్, డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానవిజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ మూవీని 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు.

Related posts