telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

డే నైట్ టెస్టులో .. గెలుపు దిశగా భారత్..

india will win in d & n match also

డే నైట్ టెస్టులో భారత బౌలర్ల ధాటికి బంగ్లా టైగర్స్ చేతులెత్తేశారు. క్రీజులోకి దిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్లు.. మొదట్లో తడబడ్డా.. తర్వాత ఇన్నింగ్స్ చక్కదిద్దారు. బంగ్లాదేశ్ టీమ్‌ను.. 106 రన్స్‌కే ఆలౌట్ చేసి సత్తా చాటారు. తర్వాత ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా.. ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ త్వరగానే పెవిలియన్ చేరారు. తర్వాత.. చటేశ్వర్ పుజారా కాస్త క్రీజులో కుదురుకున్నట్లు అనిపించినా.. కాసేపటికే ఔటయ్యాడు. ప్రస్తుతం కోహ్లీ, రహానే.. క్రీజులో ఉన్నారు. తొలి రోజు.. భారత్ 3 వికెట్లు కోల్పోయి 174 రన్స్ చేసింది. ప్రస్తుతం టీమిండియా 68 పరుగుల లీడ్ లో ఉంది.

హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ.. మరో వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. కెప్టెన్‌గా 5 వేల పరుగుల్ని వేగంగా పూర్తి చేసిన ప్లేయర్‌గా విరాట్ నిలిచాడు. కేవలం 86 ఇన్నింగ్స్‌ల్లోనే.. కోహ్లీ ఈ ఘనత సాధించాడు. అతనికిది 84వ టెస్టు కావడం మరో విశేషం. విరాట్ ఇప్పటి వరకు టెస్టుల్లో 7 వేలకు పైగా రన్స్ చేశాడు. అంతకుముందు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు.. అదే పెద్ద తప్పిదమని తర్వాత అర్థమైంది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బంగ్లా బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. 30 లోపు 3 వికెట్లు, 60 రన్స్‌కు 6 వికెట్లు, 106కు ఆలౌట్.. ఇన్నింగ్స్ ఆసాంతం బంగ్లా పతనం ఇలా సాగింది. బంగ్లా బ్యాట్స్‌మెన్లలో నలుగురు డకౌటవగా.. ఐదుగురు సింగిల్ డిజిట్ స్కోరు చేశారు. ఓపెనర్ ఇస్లాం ఒక్కడే 29 రన్స్‌తో హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ చెలరేగిపోయాడు. 5 వికెట్లు తీసి.. బంగ్లా నడ్డి విరిచాడు. ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు, షమీ 2 వికెట్లు పడగొట్టారు. అలా.. బంగ్లాదేశ్ 106 రన్స్‌కే ఆలౌటైంది.

Related posts