telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వాలంటీర్ ఆత్మహత్యాయత్నం.. ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్!

chandrababu

వేధింపులు తట్టుకోలేక విజయనగరం జిల్లాలో ఓ వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. తమ మాట వినని వాలంటీర్లను వేధింపులకు గురి చేస్తూ, ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని వైసీపీ సర్కారు పై మండిపడ్డారు. కరోనా సాయం కింద ప్రజలకు అందిస్తున్న వెయ్యి రూపాయాల సాయాన్ని వైసీపీ నేతలే ఇస్తామని ఎలా చెబుతారన్నారు. దీనికి ఒప్పుకోని వాలంటీర్లను విధుల్లోంచి తొలగించడం సమంజసం కాదన్నారు.

విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం, గెడ్డతిరువాడకు చెందిన బొంగు కార్తీక్, గోపిశెట్టి ఝాన్సీలను వైసీపీ నేతల మాట వినలేదని విధుల్లోంచి తొలగించారు. ఝాన్సీ ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు ఉన్నది ప్రజల కోసమా? పార్టీకోసమా అని ప్రశ్నించారు.ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడానికే అని చెప్పి వాలంటీర్లను పెట్టుకున్నారు. ప్రజాధనంతో వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. అలాంటప్పుడు కరోనా సాయం కింద ఇచ్చే 1,000 రూపాయలను వైసీపీ నేతలు ఇస్తాననడం ఏంటి? అని బాబు ప్రశ్నించారు.

Related posts