telugu navyamedia
రాజకీయ

భారత్‌ కరోనా అప్డేట్‌

భారత్‌లో మరోసారి కోవిడ్ కేసులు పెరిగాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశంలో కొత్త‌గా 23,529 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య‌, ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,37,39,980కు చేరింది. దేశంలో తాజాగా 28,718 మంది కోలుకోగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,30,14,898 మంది కోలుకున్నారు.

ఇక నిన్న క‌రోనాతో 311 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,48,062కి చేరింది. 2,77,020 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స పొందుతున్నారు. కేర‌ళ‌లో కొత్త‌గా 12,161 మందికి క‌రోనా సోకింది. 155 మంది నిన్న ఆ రాష్ట్రంలో క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.

Related posts