telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భారత కరోనా అప్డేట్…

corona vairus

భారత దేశ వ్యాప్తంగా కరోనా కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 87 లక్షలు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 44,878 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా…కరోనా వల్ల మొత్తం 547 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 47,079 డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 87,28,795 కాగా ….దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 4,84,547 గా ఉన్నాయి. ఇక కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 81,15,580 కి చేరింది. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,28,688 గా నమోదైంది. ఇటు దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 92.89 శాతంగా ఉండగా… దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 5.63 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.48 శాతముగా నమోదయ్యింది. అయితే యాక్టీవ్ కేసులు 5 లక్షల కంటే తక్కువగా ఉండటం ఊరట కలిగిస్తున్న విషయం. ఇక గత 24 గంటలో దేశవ్యాప్తంగా 1139230 కరోనా పరీక్షలు నిర్వహించారు.

Related posts