telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“డర్టీ హరి” హీరోయిన్ లుక్ విడుదల

Dirty-Hari

గతంలో మ‌న‌సంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఒక్క‌డు, వ‌ర్షం వంటి క్లాసిక్ చిత్రాల‌ని తెర‌కెక్కించి ద‌ర్శ‌కుడు ఎంఎస్ రాజు చాలా గ్యాప్ త‌ర్వాత “డ‌ర్టీ హ‌రి” అనే చిత్రం చేస్తున్నట్టు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఎంఎస్‌ రాజు దర్శకత్వంతో రూపొందుతున్న ఈ సినిమాను ఎస్పీజే క్రియేషన్స్‌ బ్యానర్‌పై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్‌లు నిర్మిస్తున్నారు. ఈ జనరేషన్‌కు తగ్గట్టుగా ఓ బోల్డ్‌, డర్టీ కథాంశంతో చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇటీవ‌ల హీరో లుక్ విడుద‌ల చేయ‌గా ఇందులో టైటిల్ రోల్ పోషిస్తున్న శ్ర‌వ‌ణ్ రెడ్డి బాత్‌ టబ్‌లో షర్ట్ లేకుండా ఉన్నాడు. హీరోకు ఓ అమ్మాయి తన కాళ్లతో సిగరెట్ అందిస్తున్నట్టుగా పోస్టర్‌ను డిజైన్‌ చేశారు. తాజాగా చిత్ర క‌థానాయిక పోస్ట‌ర్ రివీల్ చేశారు. రుహానీ శ‌ర్మ .. వ‌సుదేవ అనే పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని తెలుపుతూ ఆమె లుక్ రివీల్ చేశారు. పోస్ట‌ర్‌లో రుహానీ చీరక‌ట్టులో డీసెంట్‌గా క‌నిపిస్తుంది.

Related posts