telugu navyamedia
రాజకీయ వార్తలు

అమెరికాలో కరోనా ఉగ్రరూపం..మరోసారి షట్‌డౌన్‌..!

Corona

అమెరికాలో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో ప్రతిరోజు 70 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో తిరిగి పుంజుకునే అవకాశాలు కనపడట్లేదు. దీనిపై అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) స్పందిస్తూ.. అమెరికాలో కరోనా విజృంభణ విపరీతంగా ఉన్న నేపథ్యంలో మరోసారి షట్‌డౌన్‌ తప్పకపోవచ్చునని తెలిపింది.అగ్రరాజ్యంలో విస్తరిస్తున్న పేదరికంతో పాటు ఆరోగ్య వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఓ నివేదికలో తెలిపింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థను మళ్లీ పునరుద్ధించేందుకు ఎన్నో చర్యలు చేపట్టినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి 37 శాతం తగ్గిందని తెలిపింది.ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 6.6 శాతం తగ్గే అవకాశం ఉందని చెప్పింది. కరోనా ఉద్ధృతి వల్ల అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మరోసారి ఆంక్షల్ని విధించారని తెలిపింది.

Related posts