*మూడో రోజు కొనసాగుతున్న విద్యార్ధుల ఆందోళన
*బాసర ట్రిఫుల్ యూనివర్సిటీలో భారీగా పోలీసులు మోహరింపు
*విద్యార్ధులు బయటకు రాకుండా బారికేడ్లను ఏర్పాటు..
*ముఖ్యమంత్రి వచ్చే వరకు ఉద్యమం ఆపే ప్రసక్తే లేదంటున్నట్రిపుల్ ఐటీ విద్యార్ధులు
నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో స్టూడెంట్స్ ఆందోళనలు మూడో రోజు కొనసాగుతూనే ఉంది. తమ 12 డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని స్టూడెంట్స్ బీష్మించుకున్నారు .
ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వైపు నుంచి విద్యార్థులంతా బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్ధులు బయటకు రాకుండా భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు.
కనీసం విద్యార్థుల తల్లిదండ్రులు కూడా క్యాంపస్‌లోనికి రాకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.
మరోవైపు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమవి సిల్లీ డిమాండ్లు అని మంత్రి పేర్కొనడం దారుణమన్నారు. ‘‘హైదరాబాద్‌లో ఉండి మాట్లాడటం కాదు…ఇక్కడికి వచ్చి చూడాలి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. జిల్లా కలెక్టర్ తీరు బాగోలేదని, చర్చలకు పిలిచి బెదిరించారని విద్యార్థులు తెలిపారు.
“కాళేశ్వరం” కు జాతీయ హోదా దక్కకుండా చేసిన పాపం కాంగ్రెస్‌దే: మంత్రి హరీశ్ రావు