telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఎంఐఎం ఓ దేశ ద్రోహి అంటున్న బండి…

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు నిరసనగా… ఇవాళ పీవీ జ్ఞానభూమి, ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులర్పించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌.. ఈ సందర్భంగా మరోసారి ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకలు పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ అని తెలిపిన బండి సంజయ్… ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలు పొందిన నేతలు వారు.. పార్టీలకు అతీతంగా వారిని ఆదరిస్తారని.. కానీ, ఎంఐఎం తీరు మాత్రం దురదృష్టకరమన్నారు. ఇక, జయంతి ఉత్సవాలు నిర్వహించడం ముఖ్యంకాదు.. సంఘ విద్రోహక శక్తులు కూల్చుతామని అంటే సీఎం కేసీఆర్ ఎందుకు స్పదించడం లేదని ప్రశ్నించిన బీజేపీ చీఫ్.. అవసరానికి అనుగుణంగా పొగడతారు… అవసరం లేకపోతే అవమానిస్తారు అంటూ మండిపడ్డారు. పీవీ, ఎన్టీఆర్ లు బీజేపీకి చెందినవారు కాదు అని గుర్తు చేశారు బండి సంజయ్‌.. అయితే, ఆ ఇద్దరు నేతలపై ఎంఐఎం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై ఓటు బ్యాంకు కోసం అధికార పార్టీ కనీసం స్పందించడం లేదని ఆరోపించారు.. బీజేపీ చెప్పింది చేస్తుంది.. ఎన్టీఆర్, పీవీ ఘాట్లకు బీజేపీ రక్షణగా ఉంటుందని ప్రకటించారు. ఎంఐఎం పార్టీ దేశ ద్రోహ పార్టీగా ముస్లింలే భావిస్తున్నారన్న ఆయన.. ఎన్టీఆర్ స్కూల్ నుంచే వచ్చి ఈ రోజు సీఎం అయిన కేసీఆర్… అభిమాన నాయకుడిని అవమనిస్తే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.. కేటీఆర్ డ్రామా రావుగా మారారు అంటూ సెటైర్లు వేసిన సంజయ్… రోహింగ్యాలను ప్రభుత్వం గుర్తించినట్లు భావిస్తున్నామన్నారు. ఇక, ప్రశాంతంగా గ్రేటర్ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం.. కానీ, సీఎం కేసీఆర్‌ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఏదేమైనా గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ గెలవబోతోంది.. కానీ, గ్రేటర్ ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయకుండా భయానక వాతావరణం సృష్టిస్తున్నారని విమర్శించారు. పార్టీలకు అతీతంగా నివాళులు అర్పించడానికి బీజేపీ నేతలు వస్తే… భారత రత్నకు, ఎన్టీఆర్ ఘాట్ కూల్చడానికి ఎంఐఎం వ్యాఖ్యలకు సంబంధం ఏంటి ? అని ప్రశ్నించారు. ఇక, భారతరత్న ఇవ్వాలని బీజేపీ ఖచ్చితంగా కోరుతుందని స్పష్టం చేసిన ఆయన.. ఏపీ, తెలంగాణ రెండు బీజేపీ శాఖలు కలిసి ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కోరుతున్నామన్నారు.

Related posts