telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అందరు దేవుళ్లపై ఒట్టు… ‘పవర్ స్టార్’ పీకే గురించి కాదు… : ఆర్జీవీ

RGV

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కేవలం ట్విట్టర్‌ ద్వారానే తన సినిమాలకు ప్రచారం కల్పించుకుంటున్నారు. ప్రస్తుతం ‘పవర్ స్టార్’ సినిమా విషయంలోనూ ఆయన అదే ఫాలో అవుతున్నారు. ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో విడుదల చేసే ఈ 30 నిమిషాల సినిమాను ఓ రేంజ్‌లో ప్రమోట్ చేస్తున్నారు. ‘పవర్ స్టార్’ అని టైటిల్ పెట్టి.. ‘ఎన్నికల ఫలితాల తర్వాత కథ’ అని ట్యాగ్ లైన్ పెట్టి.. అచ్చం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తినే సినిమాలోకి దించి.. చంద్రబాబు లాంటి వ్యక్తిని, రష్యా మహిళను పరిచయం చేసి.. ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గురించి తీస్తోన్న సినిమా కాదు అని వాదిస్తున్నారు వర్మ. తాజాగా ‘పవర్ స్టార్’ సినిమా నుంచి ‘గడ్డి తింటావా’ అనే సాంగ్‌ను ఆర్జీవీ విడుదల చేశారు. ఆర్జీవీ ఫ్యాన్స్, పవన్ యాంటీ ఫ్యాన్స్ నుంచి ఈ పాటకు మంచి స్పందనే వస్తోంది. పాట విడుదలైన 5 గంటల్లో సుమారుగా 5 లక్షల మంది వీక్షించారు. యూట్యూబ్‌లో ఈ పాటకు 38 వేలకు పైగా లైకులు రాగా.. 21 వేలకు పైగా డిజ్‌లైకులు వచ్చాయి. అయితే, డిజ్‌లైకుల విషయంలో వర్మ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా మరోసారి పవన్ ఫ్యాన్స్‌ను కెలికారు. ‘‘పవర్ స్టార్ పాటకు 5 గంటల్లో 5 లక్షల వ్యూస్ వచ్చాయి. కేవలం 20 వేల డిజ్‌లైక్స్ ??? నేను షాక్‌కు గురయ్యాను. ఒక పీకే ఫ్యాన్‌గా హర్ట్ అయ్యాను. ఇక్కడ కేవలం 20 వేల మంది పీకే ఫ్యాన్సే ఉన్నారా?’’ అంటూ ట్వీట్ చేశారు.

వర్మ అక్కడితో ఆగలేదు. వరుస ట్వీట్లతో మ్యాటర్‌ను హీటెక్కించారు. బహుశా ఈ ఫ్రస్టేషన్ ఆయనకు వ్యతిరేకంగా వస్తోన్న ‘పరాన్నజీవి’ సినిమా గురించి కూడా కావచ్చు. అందుకే, ‘పవర్ స్టార్’ సినిమాను పవన్ కళ్యాణ్‌పై వేస్తోన్న సెటైర్ అని రాస్తోన్న మీడియాపై కూడా వర్మ మండిపడుతున్నారు. ‘‘నిరాధారమైన, బాధ్యతారాహిత్యమైన మీడియాలో వచ్చే వార్తలను ఆధారంగా చేసుకొని ‘పవర్ స్టార్’ సినిమా పీకే గురించి అని అనుకుంటున్నారు 20 వేల మంది ఫ్యాన్స్. కానీ, అది నిజం కాదు. ఆ 20 వేల మంది కాస్త ప్రశాంతంగా ఉండండి’’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు వర్మ. ఆ తరవాత మరో ట్వీట్‌లో.. ‘‘ప్రియమైన ఆ 20 వేల మంది పీకే ఫ్యాన్స్‌కు చెప్పేదేంటంటే నేను కూడా పీకే ఫ్యాన్. నేను పీకే ఫ్యాన్‌‌ని అని మీరు నమ్మకపోతే.. మీరు కూడా పీకే ఫ్యాన్స్ అని నేను నమ్మను. దైవ సాక్షిగా అందరి దేవుళ్లపై ఒట్టేసి చెబుతున్నా ‘పవర్ స్టార్’ పీకే గురించి కాదు’’ అని బల్లగుద్ది చెప్పారు వర్మ.

Related posts