telugu navyamedia
సినిమా వార్తలు

విజయ్, అట్లీ సినిమా షూటింగ్ లో అపశ్రుతి

Vijay-with-Atlee

ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో కోలివుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న కొత్త సినిమా చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా ఈ షూటింగ్ లో అపశ్రుతి చోటు చేసుకుంది. తమిళనాడులోని పూందమల్లి ఈవీపీ ఫిలిమ్స్ సిటీలో విజయ్ సినిమా షూటింగ్ జరుగుతోంది. సినిమా క్లైమాక్స్ కి సంబంధించిన కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. సినిమా సెట్ లో క్రేన్ పై వంద అడుగుల ఎత్తులో అమర్చిన ఓ లైట్… షూటింగ్ లో ఉన్న ఎలక్ట్రీషియన్ సెల్వరాజ్ పై పడింది. దీంతో అతడి తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే అతన్ని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇది ఇలా ఉండగా బుధవారం విజయ్ నేరుగా హాస్పిటల్ కి వెళ్లి సెల్వరాజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Related posts