telugu navyamedia
క్రైమ్ వార్తలు

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో గంజాయి క‌ల‌క‌లం..

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పోలీసులు భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సాగు, అక్రమ రవాణా వ్యాపారం హద్దూ అదుపూ లేకుండా సాగుతోంది. రోడ్డు, రైలు, సముద్ర మార్గాల్లో రవాణా అవుతున్న గంజాయి… నిత్యం ఎక్కడో ఒకచోట పట్టుబడుతూనే ఉంది.

వివ‌ర్లాలోకి వెళితే..

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో 54 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో… రైల్వే పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో 54 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

గంజాయి తరలిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ముఠాలో ఒడిశాకు చెందిన ఇద్దరు, ముంబైకి చెందిన ఇద్దరు ఉన్నారు. నిందితుల నుంచి 16 లక్షల రూపాయలు విలువ చేసే 54 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఒడిశాలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ మీదుగా కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయిని ముంబైకి రవాణా చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

Related posts