telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

నిత్యావసర వస్తువుగా.. సిగరెట్, ..నకిలీవి బ్రాండెడ్ ధరకు.. !!

SIT Investigation YS viveka Murder

నిత్యావసర వస్తువుగా చెప్పాలంటే, చాలా ఉంటాయి. కానీ ఇటీవల సిగరెట్ ను కూడా అందులో చేర్చారేమో; ఇక త్వరలో రేషన్ షాప్ లలో కూడా అది ఇస్తారేమో.. అన్నట్టుగా దాని వాడకం పెరిగిపోయింది. ప్రతి గంటా లేదా అరగంటకు దాన్ని ఉదనిదే పొగరాయిళ్ళకు మనశ్శాంతి ఉండదు. కావునా వాటికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని నగరానికి సిగరెట్ల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఖరీదైన సిగిరెట్లను ఇండోనేషియా, దుబాయ్‌ తదితర దేశాల నుంచి స్మగ్లింగ్‌ చేస్తున్నారు. తక్కువ ధరకు లభించే వాటిని భారత్ సరిహద్దు దేశాలైన భూటాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి ఎగుమతి చేస్తున్నారు.

వాటి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలో దిగారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బేగంబజార్‌లోని ఓ దుకాణంపై దాడి చేశారు. దాదాపు రూ 6.48 లక్షల విలువైన అక్రమ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నగరానికి రవాణా చేస్తున్నారు. తక్కువ ధరకు వాటిని కొనుగోలు చేసి వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముతూ లాభాలు గడిస్తున్నారు. స్మగ్లర్ల నుంచి ఒక్కో ప్యాకెట్‌ రూ.6కు ఖరీదు చేసి వాటిని రైళ్లలో నగరానికి తరలిస్తున్నారు. సిగరెట్లను హోల్‌సేల్‌ ప్యాకెట్‌ రూ.20 చొప్పున అమ్ముతుండగా..వినియోగదారులకు రూ.30కి విక్రయిస్తున్నారు.

cigarette smuggling scamఅక్రమ మార్గంలో బంగ్లాదేశ్‌ నుంచి దిగుమతి అవుతున్న ఈ సిగరెట్లు ప్యారిస్‌ పేరుతో, నకిలీ బ్రాండ్ పేరుతో ముద్రించినవిగా విచారణలో తేలింది. ఈ సిగరెట్లు రైల్వే కార్గో ద్వారా, వివిధ పేర్లతో భారత్‌లోకి వస్తున్నాయి. కోల్‌కతాలో ఉన్న స్మగర్ల నుంచి రైల్వే కార్గో రూపంలోనే హైదరాబాద్‌కు వస్తున్నట్లు వెల్లడైంది. నగరంలో నకిలీ బ్రాండ్ల పేరుతో విక్రయించే అక్రమ వ్యాపారులు చాలా మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిపై ఎలాంటి హెచ్చరిక ముద్రలు లేకుండా ప్యాకెట్లను అమ్ముతుండడంతో, రింగు రింగులుగా పొగ వదులుతూ గుప్పు గుప్పుమని కాల్చే సిగరెట్ ప్రియులు అనారోగ్యాల బారినపడుతున్నారని పోలీసులు తెలిపారు.

Related posts