telugu navyamedia
రాజకీయ

పోప్ ఫ్రాన్సిస్‌ను భార‌త్‌కు ఆహ్వానించిన ప్ర‌ధాని మోదీ..

భారత ప్రధాని మోడీ వాటికన్‌ సిటీలో కాథలిక్ క్రైస్తవుల మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్‌తో స‌మావేశమయ్యారు. వాటికన్ సిటీకి చేరుకున్న ప్రధాని మోడీకి  స్వాగతం పలికిన పోప్ ఫ్రాన్సిస్.. ఆలింగనం చేసుకుని అభినందించారు. ఆ తరువాత పోప్‌ ఫ్రాన్సిస్‌తో సమావేశమయ్యారు మోడీ. అంతర్జాతీయ అంశాలపై ఇద్దరి మధ్య గంటపాటు చర్చలు జరిగాయి.

Image

ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. పోప్ను భారత పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానించారు ప్రధాని మోడీ. ఇద్దరి మధ్య గంటపాటు సాగిన సమావేశంలో అనేకాంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. పర్యావరణ మార్పులకు అడ్డుకట్ట వేయడం, పేదరికాన్ని నిర్మూలించడం వంటి అంతర్జాతీయ సమస్యలపై చర్చించారు.

Image

జీ-20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ రోమ్‌లో పర్యటిస్తున్నారు. గత 12 ఏళ్ల తర్వాత రోమ్‌లో పర్యటిస్తున్న భారత తొలి ప్రధాని మోడీ కావడం విశేషం. ప్రధాని మోడీ వెంట విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్..జాతీయ భ‌ద్ర‌తాస‌ల‌హాదారు అజిత్ ధోవ‌ల్ కూడా ఉన్నారు.

పోప్ తో భేటీ గురించి ప్రధాని మోదీ ఇలా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. “పోప్ ఫ్రాన్సిస్‌తో చాలా వెచ్చని సమావేశం జరిగింది. ఆయనతో విస్తృతంగా చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి భారతదేశాన్ని సందర్శించమని కూడా ఆహ్వానించాను..’’ అని వెల్లడించారు.

Image

కాగా.. చివరిసారిగా 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలంలో పోప్ జాన్ పాల్ II భారత్ పర్యటించారు.మళ్లీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కొనసాగుతున్న కాలంలో పోప్‌ను భారత్‌కు ఆహ్వానించడం గమనార్హం.

Related posts