telugu navyamedia
రాజకీయ వార్తలు

అప్ఘానిస్తాన్‌లో మరో భారీ విస్ఫోటనం

అప్ఘానిస్థాన్‌లో మరోసారి భారీ పేలుడు సంభవించింది. ఉత్తర అప్ఘానిస్తాన్‌లోని కుందుజ్ రాష్ట్రంలో ఓ మసీదులో శక్తివంతమైన పేలుడు జరిగింది. శుక్రవారం కావడంతో ప్రార్థనలకు పెద్దఎత్తున తరలిరావడంతో ప్రాణ నష్టం అధికంగా ఉంది. సుమారు 100 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా అనేక మందికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

శుక్రవారం మధ్యాహ్నం వందలాదిమంది ముస్లింలు ప్రార్థన చేసుకుంటుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో భారీ సంఖ్యలో మరణాలు సంభవించినట్టు తాలిబన్ల అధికార ప్రతినిధి వెల్లడించారు. భారీ పేలుళ్లతో పెద్ద శబ్దాలు వినపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఈ ఘటనతో మసీదులో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిన దృశ్యాలు. గాయపడ్డ వారి హాహా కారాలతో ఆ ప్రాంతమంతా భీతావహ వాతావరణం నెలకొంది. ఈ దాడికి పాల్పడింది ఎవరనేది ఇంతవరకు ఏ గ్రూపు ప్రకటించలేదు. అప్ఘానిస్తాన్‌ తాలిబన్ల వశమైనప్పటి నుంచి అక్కడ ఐఎస్ దాడులు పెరుగుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Related posts