telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

జగన్ ను తిట్టడం.. విధ్వేషాలను రెచ్చగొట్టడమే బాబు ఉద్ధేశం…

చంద్రబాబు విశాఖ పర్యటన పై మంత్రి అప్పలరాజు పైర్ అయ్యారు. విశాఖలో చంద్రబాబు ప్రసంగం సినిమా డైలాగ్ లను తలపించింది. జగన్ ను తిట్టడం.. విధ్వేషాలను రెచ్చగొట్టడమే బాబు ఉద్ధేశం. చంద్రబాబు వ్యాఖ్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు విశాఖ వచ్చిన ఉద్ధేశమేంటి… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై పోరాడటానికా… వైఎస్ జగన్ ను తిట్టడానికా అని అడిగారు. చంద్రబాబుకు మోదీ అంటే ఉచ్చ… అందుకే ఆయన మోదీని ఒక్క మాటకూడా అనలేకపోయారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలనుకున్నది కేంద్రమా , రాష్ట్రమా ముందు తెలుసుకోవాలి. రాష్ట్రమే ప్రైనేటీకరణ చేసేస్తున్నది రాష్ట్రప్రభుత్వమే అయితే మమ్మల్ని తిట్టండి మేం పడతాం. 2017 లో సౌత్ కొరియా వెళ్లి పోస్కో ప్రతినిధులను చంద్రబాబు కలిశారు. చాలా సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై వార్తలు వస్తున్నాయని అన్నారు. అప్పుడెందుకు చంద్రబాబు మాట్లాడలేకపోయాడు ? చంద్రబాబు దగుల్భాజీ రాజకీయాలకు పాల్పడుతున్నాడని అన్నారు. చంద్రబాబుకు సిగ్గనిపించడం లేదా, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బాబు , లోకేష్ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు.

Related posts