గ్రామ న్యాయాలయాలపై కోర్టు తీర్పు వెలువరించింది. క్యాబినెట్ 84 చోట్ల ఏర్పాటు చేయాలని తీర్మానం చేసినా అవసరానికి అనుగుణంగా ఏర్పాటు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. 84 ఏర్పాటు చేస్తే ఆర్థికంగా భారం అవుతుందని, ప్రభుత్వంపై ఖర్చు ఎక్కువ కాకుండా చేస్తామని తెలిపింది. దీనిపై హైకోర్టు పరిపాలనాధికారి హోదాలో ప్రధాన న్యాయమూర్తి తగిన ఉత్తర్వులు వెలువరిస్తారని హైకోర్టు స్పష్టం చేసింది. గ్రామ న్యాయలాయాలను ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ అవనిగడ్డకు చెందిన భిక్షం వేసిన పిల్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్‌ల డివిజన్ బెంచ్ విచారించింది.
రాష్ట్ర మంత్రివర్గం 84 గ్రామ న్యాయాలయాను ఏర్పాటు చేయాలని తీర్మానం చేసిన విషయాన్ని ఏజీ శ్రీరామ్ హైకోర్టుకు తెలిపారు. ఇవి చాలా ఎక్కువని, అన్ని ఏర్పాటు చేసేందుకు తాము అనుమతి ఇవ్వమని, దీనిపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది.