ఆరోగ్య నిపుణులు ఎవరైనా ఆహారం ఎలా తీసుకోవాలి అంటే, సాధారణంగా బి.ఎం.ఐ. ఇండెక్స్ ప్రకారం తీసుకోమంటారు. అయితే, బ్లడ్ గ్రూప్ ఆధారంగా డైట్ తీసుకోవడం కూడా ఆరోగ్యపరంగా చాలా ముఖ్యం అని పరిశోధకులు తెలియచేస్తున్నారు. ఏ, బీ, ఏబీ, ఓ గ్రూప్ వాళ్లంతా ఒకే రకమైన ఆహారం తీసుకోవడం కన్నా.. వారి వారి బ్లడ్ గ్రూప్‌ను బట్టి ఆహారం తీసుకోవాలి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏ రక్తం వారు ఏయే ఆహార పదార్థాలను తీసుకోవాలంటే :
* ఓ-గ్రూప్ రక్తం ఉన్నవారిలో జీర్ణాశయంలో ఆమ్లాల ఉత్పత్తి ఎక్కవగా ఉంటుంది. దీంతో వీరు అజీర్తి, థైరాయిడ్ సమస్యలకు గురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి అంట. ప్రోటీన్లు అధికంగా ఉన్న డైట్ తీసుకోవాలని పరిశోధలు సూచిస్తున్నారు. చికెన్ , చేపలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. పప్పుదినుసులు, బీన్స్, పాల ఉత్పత్తులను మాత్రం తక్కువగా తినడం చాల మంచిది.
* ఏ-గ్రూప్ రక్తం ఉన్నవారిలో రోగనిరోధక శక్తి కొంచెం బలహీనంగా ఉంటాది. ఇక వీరికి మధుమేహం, అధిక బరువు సమస్యలు వీరికి వచ్చే ఆస్కారం ఎక్కువ. అందుకే ‘ ఏ ‘ గ్రూప్ బ్లడ్ ఉన్నవారు పండ్లు, కూరగాయలు, బీన్స్, చిక్కుడు, శనగలు, తృణ ధాన్యాలు చాల ఎక్కువగా తినాలి . వీరు మాత్రం మాంసం చాలా తగ్గువగా తీసుకోవడం చాలా మంచిది.
* బీ-గ్రూప్రక్తం ఉన్న వారు మొక్కజొన్న, గోధుమ, పప్పు దినుసులు, టొమాటో, వేరు శనగలు, నువ్వులు, చికెన్ చాలా తగ్గువగా తీసుకోవడం చాలా మంచిది. ఆకుపచ్చ రంగులో ఉన్న కూరగాయలు, గుడ్లు, తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు తీసుకోవడం చాలా మంచిది. ‘ బీ ‘ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ ఉత్పత్తి అధికంగా ఉంటాది. ఫలితంగా వీరు మధుమేహం, అధిక బరువు, ఆటో ఇమ్యూన్ వ్యాధులకు లోనయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అని నిపుణులు తెలియచేస్తున్నారు.
*ఏబీ-గ్రూప్ ఉన్న వారికీ సోయాతో చేసిని టోపు, సీ ఫుడ్, పాల ఉత్పత్తులు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వీరు జీర్ల సంబంధమైన సమస్యలకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ‘ ఏబీ ‘ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు కెఫిన్ అధికంగా ఉండే కాఫీ, చాక్లెట్లలతో పాటు ఆల్కహాల్ కానీ బాగా కాల్చిన మాంసం అసలు తినకూడదు.