telugu navyamedia
క్రీడలు వార్తలు

వచ్చిన వాళ్లతోనే లీగ్ పూర్తి చేస్తాం : రాజీవ్ శుక్లా

కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2021లీగ్‌‌ను యూఈఏ వేదికగా పూర్తి చేయాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ఇంకా ఖరారు చేయకపోయినప్పటికీ సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 10 మధ్య లీగ్ పూర్తి చేయాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఈ టైమ్‌లో విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఆయా దేశాల బీజీ ఇంటర్నేషనల్ షెడ్యూల్ వల్ల స్టార్ ప్లేయర్లు ఐపీఎల్ 2021 సెకండాఫ్ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. దాంతో ఫ్రాంచైజీలతో పాటు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే వచ్చిన వాళ్లతోనే లీగ్ పూర్తి చేస్తామని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించగా.. రాజీవ్ శుక్లా సైతం మరోసారి క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచ్‌ల ఏర్పాటు కోసం యూఏఈ వెళ్లిన రాజీవ్ శుక్లా.. అక్క‌డి ప్ర‌ముఖ ప‌త్రిక ఖ‌లీజ్ టైమ్స్‌తో మాట్లాడారు. మ‌రో రెండు రోజుల్లో బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ, సెక్ర‌ట‌రీ జే షా, ఐపీఎల్ చైర్మ‌న్ బ్రిజేష్ ప‌టేల్ కూడా యూఏఈ రానున్న‌ట్లు తెలిపాడు. అందుబాటులో లేని విదేశీ ఆటగాళ్ల ప్లేస్‌లో ఇతర ఆటగాళ్లను తీసుకునేలా ఫ్రాంచైజీలకు అవకాశం కల్పిస్తామని చెప్పాడు. ఎవరి కోసం లీగ్ ఆపమని స్పష్టం చేశాడు.

Related posts