telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

విశాఖ ఉక్కు చరిత్ర ముఖ్యమంత్రికి తెలుసా …!?

chandrababu

విశాఖ ఉక్కు పోరాటానికి నాయకత్వం వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని చంద్రబాబు అన్నారు. మనోభావాలు,ప్రయయోజనాలు కాపాడడానికి ఎంతకైనా పోరాడతాం… ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి బేషజాలు లేవు…. రాజకీయాలు అవసరం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం….ఇప్పుడు సమిష్టి పోరాటం చేయకపోతే భవిష్యత్ తరాలు దెబ్బ తింటాయి అని పేర్కొన్నారు. అసలు విశాఖ ఉక్కు చరిత్ర ముఖ్యమంత్రికి తెలుసా …!? అప్పుడికి ఆయన పుట్టే వుండడు. ఉక్కు పరిశ్రమ త్యాగాలను ఇలాంటి ముఖ్యమంత్రి వృధా చేస్తారని ముందే తెలిస్తే అమృత రావు ప్రాణాలైనా నిలిచేవి అని అన్నారు. ముఖ్యమంత్రిగా నేను ఉక్కు పరిశ్రమను నేను కాపాడాను. ఇప్పటి ముఖ్యమంత్రి కూడా కాపాడాల్సిందే. కానీ ఇప్పుడు ఒకాయన పాదయాత్ర చేస్తా అంటున్నారు. పట్టువిడుపులు ఉండాలంటూ ఆయన ఉపదేశం చేశారు. ఆయన పాదయాత్రలు, మాయ మాటలు మాకు అక్కర్లేదు. పోస్కో ఎందుకు వచ్చింది. కోడి కత్తి ఘటనకు రెండేళ్లయింది.. ఏమయింది ఆ కోడి కత్తి అని ప్రశ్నించారు. విశ్వసనీయత అంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారు. నిన్న ఎన్నికల్లో మొత్తం గుద్దేసుకున్నారు. ఆంధ్రుల ఉక్కు సంకల్పం తో విశాఖ ఉక్కు వచ్చింది. యువత ముందుకు వచ్చి పోరాడాలి అని సూచించారు.

Related posts