telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవు…

gangula kamalakar trs

ప్రస్తుతం తెలంగాణలో వైసీ షర్మిల కొత్త పార్టీ హల చల్ చేస్తుంది. చాలా మంది నాయకులు దీని పై స్పందిస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన కరీంనగర్ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ..  వైఎస్ షర్మిల పార్టీపై స్పందించారు. జగనన్న బాణం షర్మిల వస్తోందని..  తర్వాత మెల్లగా జగన్ వస్తాడని, జగన్ తర్వాత చంద్రబాబు కూడా వస్తాడని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవని, కేసీఆర్‌ను మనం కాపాడుకోవాలని, లేకపోతే సమైక్య రాష్ట్రం అవుతుందని హెచ్చరించారు. ఆంధ్రా నేతలు కరెంటు, నీళ్లు ఎత్తుకపోతారని, కేసీఆరే రక్షకుడని గంగుల అన్నారు కేసీఆర్ ను మనం కాపాడుకోవాలి లేకపోతే ఇబ్బందులు తప్పవని అన్నారు. మరోపక్క తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటున్న వైఎస్ షర్మిల.. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.. లోటస్ పాండ్ వేదికగా ఆమె తెలంగాణ రాజకీయాలను శాసించాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే షర్మిల పార్టీ ప్రకటన రాకుండానే ఆమె మీద ఇతర పార్టీ నేతల విమర్శల దాడి తీవ్రంగా సాగుతోంది.  చూడాలి మరి వీటికి షర్మిల ఎలా సమాధానం ఇస్తుంది అనేది.

Related posts