telugu navyamedia
క్రీడలు

స్టేడియంలో గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసిన దీపక్ చాహర్.

దుబాయ్ లో ఐపీఎల్‌-2021 రెండో దశలో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్‌ అనంతరం సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ దీపక్‌ చాహర్ స్టేడియంలోనే అందరూ చూస్తుండగా లైవ్‌లో తన గర్ల్‌ఫ్రెండ్‌కు రింగ్‌ తొడిగి లవ్‌ ప్రపోజ్‌ చేశాడు.

<div class="paragraphs"><p>Deepak Chahar proposed to his girlfriend after IPL 2021 match against Punjab Kings.</p></div>

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ జ‌రిగింది. పంజాబ్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాభవం చవి చూసింది. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే దీపక్ చాహర్ స్టాండ్స్‌ లోకి వెళ్లి మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్న గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేశాడు. దీపక్ చాహర్ అలా ప్రపోజ్ చేయడంతో ఆయన గర్ల్ ఫ్రెండ్ ఉబ్బితబ్బిబ్బైపోయింది.

IPL 2021 [WATCH]: Deepak Chahar proposes to his girlfriend Jaya Bhardwaj after CSK vs PBKS clash | CricketTimes.com

ఎంతో హ్యాపీగా ఫీలవుతూ ఎస్ చెబుతూ..చాహార్ ను కౌగలించుకున్నారు. స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. అక్కడే ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మెంబర్స్ కూడా చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు. స్వయంగా చాహార్ తన ఇన్ స్ట్రాగ్రామ్ పేజీలో వీడియోను పోస్టు చేయడంతో తెగ వైరలవుతోంది. కాగా, చాహర్‌ ప్రపోజ్‌ చేసిన అమ్మాయి విదేశీయురాలిగా తెలుస్తోంది.

Related posts